టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

ఐపీఎల్‌-11లో భాగంగా హోల్కార్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌, కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌లో పంజాబ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్ జట్టు ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలను మరింత సుగమనం చేసుకోవాలని చూస్తుంది. ఇక కోల్‌కతా జట్టుకు ఆడే ప్రతి మ్యాచ్ కీలకం కాబట్టి ఈ మ్యాచ్ లో గెలిచి తీరాలి. ఈ క్రమంలో ఇరు జట్లు గెలుపు కోసం పోటాపోటీగా ఆడనున్నాయి. రెండు జట్లు మార్పులతో బరిలోకి దిగనున్నాయి. కర్రన్‌ను స్థానంలో కోల్‌కతా జట్టు జావోన్ సీర్లెస్‌ను తీసుకుంది. పంజాబ్ జట్టు నాథ్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌.. తివారీ స్థానంలో బరిందర్ శ్రాన్‌.. స్టోయిన్స్ స్థానంలో ఫించ్‌ను తుది జట్టులోకి తీసుకుంది.

జట్లు:

కోల్‌కతా: దినేశ్‌ కార్తీక్‌(కెప్టెన్‌), క్రిస్‌ లిన్‌, సునీల్‌ నరైన్‌, రాబిన్‌ ఉతప్ప, శుభ్‌మాన్‌ గిల్‌, నితీష్‌ రాణా, ఆండ్రీ రస్సెల్‌, జావోన్‌ సీర్లెస్‌, పీయూష్‌ చావ్లా, ప్రసిద్ధ్‌ కృష్ణ, కుల్దీప్‌ యాదవ్‌.

పంజాబ్‌: అశ్విన్‌(కెప్టెన్‌), క్రిస్‌ గేల్‌, కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, అరోన్‌ ఫించ్‌, కరుణ్‌ నాయర్‌, అక్షర్‌ పటేల్‌, ఆండ్రూ టై, మోహిత్‌ శర్మ, బరీందర్‌ శ్రాన్‌, ముజిబ్‌ ఉర్‌ రహ్మాన్‌.