టాస్ నెగ్గి ఫీల్డింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌

టాస్ నెగ్గి ఫీల్డింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌

ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం హోల్కర్‌ క్రికెట్‌ స్టేడియంలో రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ లెవెన్ పంజాబ్‌ టాస్‌ నెగ్గి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ సీజన్‌-11లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్‌.  అయితే ఇరు జట్లకు కూడా ఈ మ్యాచ్ ఫలితం చాలా కీలకం. పంజాబ్‌ ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో ఉండగా.. రాజస్తాన్‌ మాత్రం మూడు విజయాల్ని మాత్రమే సాధించి చివరి స్థానంలో ఉంది. రాజస్తాన్‌ ప్లే ఆఫ్‌ ఆశల్ని నిలుపుకోవాలంటే ప్రతీ మ్యాచ్‌ గెలవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో పంజాబ్‌పై విజయం సాధించాలని చూస్తోంది. వరుస రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన పంజాబ్ కూడా ఈ మ్యాచ్ తో గాడిలో పడాలని భావిస్తుంది.

జట్లు:


పంజాబ్: లోకేష్ రాహుల్, క్రిస్ గేల్, కరుణ్ నైర్, మయాంక అగర్వాల్, మార్కస్ స్టోనిస్, మనోజ్ తివారీ, రవిచంద్రన్ అశ్విన్, అక్సర్ పటేల్, ముజీబ్ ఉర్ రహ్మన్, అంకిత్ రాజ్‌పుత్, అండ్రూ టై.
 
రాజస్థాన్: జాస్ బట్లర్, డి ఆర్కీ షార్ట్, అజింక్యా రహానే, సంజూ సామ్‌సన్, బెన్ స్టోక్స్, రాహుల్ త్రిపాఠి, కృష్ణప్ప గౌతమ్, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, అనురీత్ సింగ్, జయదేవ్ ఉనద్కట్.