పంజాబ్ సంచలన నిర్ణయం: ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు... 

పంజాబ్ సంచలన నిర్ణయం: ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు... 

కరోనా వైరస్ రోజు రోజుకు పెరిగిపోతున్నది.  దేశంలో ఇప్పటి వరకు 5500 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది.  గడిచిన 24 గంటల్లో 770కి పైగా కేసులు నమోదయ్యాయి.  రోజు రోజుకు ఇలా పెరిగిపోతున్న సమయంలో ఏప్రిల్ 14 వ తేదీ వరకు విధించిన లాక్ డౌన్ సరిపోతుందా అంటే లేదని తెలుస్తోంది.  ఇప్పటికే అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాలని ప్రధానిని కోరాయి.  దీనిపై ఈనెల 11 తరువాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.  

అయితే, పంజాబ్ ప్రభుత్వం లాక్ డౌన్ పై సంచలన నిర్ణయం తీసుకుంది.  లాక్ డౌన్ ను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.  ఏప్రిల్ 30 వ తేదీ వరకు లాక్ డౌన్ పెంచుతున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.  పంజాబ్ లో ఇప్పటి వరకు 79 కరోనా కేసులు నమోదయ్యాయి.  రోజు రోజుకు అక్కడ కూడా కేసులు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.