బ్యాంకుల నష్టం.. గంటకు రూ.9 కోట్లు

బ్యాంకుల నష్టం.. గంటకు రూ.9 కోట్లు

ప్రభుత్వ బ్యాంకులను నిరర్థక ఆస్తులు తినేస్తున్నాయి. ఎంత పెద్ద బ్యాంకైనా సరే ఎన్‌పీఏల దెబ్బకు నీరసించిపోతున్నాయి. ఆర్‌బీఐ నిబంధనల కారనంగా సంపాదించిన లాభమంతా నిరర్థక ఆస్తుల పద్దు కింద జమ చేయాల్సి వస్తోంది. ఈ ఆస్తులు మరీ ఎక్కువైతే నష్టాలు చూపాల్సి వస్తోంది. ఈ లెక్కన చూస్తే 2017-18లో ఏడాదికి పీఎస్‌యూ బ్యాంకుల ఎన్‌పీఏలలోకి అదనంగా   రూ. 79,000 కోట్లు  చేరాయి. దీంతో పీఎస్‌యూల బ్యాంకుల ఎన్‌పీఏ మొత్తం రూ. 8.6 లక్షల కోట్లకు చేరింది. గత రెండేళ్ళ నుంచి బ్యాంకులు తమ లాభాలను ఎన్‌పీఏల కింద జమ కట్టడానికే సరిపోతోంది.మార్చితో ముగిసిన ఏడాది బ్యాంకులు రూ. 12,285 కోట్ల నష్టాన్ని చూపాయి పీఎస్‌యూ బ్యాంకులు. అంటే గంటకు రూ. 9 కోట్ల నష్టమన్నమాట. నిమిషానికి రూ.15లక్షలు చొప్పున పీఎస్‌యూ బ్యాంకులు నష్టపోతుండగా.. ఇదే కాలంలో ప్రైవేట్‌ బ్యాంకులు రూ.42,000 నికర లాభాన్ని ప్రకటించాయి.