జేఏసీ వల్లే ప్రపంచానికి పరిచయమయ్యా..

జేఏసీ వల్లే ప్రపంచానికి పరిచయమయ్యా..

తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ వల్లే తనతో పాటు మిగిలిన సభ్యులు ప్రపంచానికి పరిచయమయ్యారని అన్నారు తెలంగాణ జన సమితి పార్టీ అధినేత ప్రొ. కోదండరామ్.. హైదరాబాద్ తార్నాకలోని సెయింట్ ఆన్స్ కాన్సలేట్‌లో తెలంగాణ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీ.జేఏసీ ఛైర్మన్ పదవికి కోదండరామ్ చేసిన రాజీనామాను ఆమోదించి.. నూతన అధ్యక్షుడిగా కంచర్ల రఘును ఎన్నుకున్నారు. అనంతరం కోదండరామ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడంలో జేఏసీ వహించిన పాత్ర మరువలేనిదని అన్నారు.. ఇలాంటి సంస్థ దేశంలోని మరే ఇతర రాష్ట్రంలోనూ లేదని.. 2009 నుంచి నేటి వరకు తనతో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు చేశామని.. పాలనలో మార్పు కోసమే పార్టీని పెట్టాల్సి వచ్చిందని.. అందుకే జేఏసీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. రాజకీయాలతో పాటు తెలంగాణలో బలమైన ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి జేఏసీ కృషి చేస్తోందన్నారు.