హాలీవుడ్ స్టార్ తో ప్రియాంక డేటింగ్..?

హాలీవుడ్ స్టార్ తో ప్రియాంక డేటింగ్..?

ఇండియాలోని బిజియస్ట్ స్టార్స్ లో ప్రియాంక చోప్రా ఒకరు.  బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉన్న ఈ నటి ఇండియా టు అమెరికాకు షటిల్ సర్వీస్ చేస్తోంది.  హాలీవుడ్ క్వాంటికో సిరీస్ తో బిజీగా మారిన ప్రియాంక ఇటీవల హాలీవుడ్ స్టార్ నిక్ జోనస్ తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.  ఈ ఇద్దరు కలిసి లాస్ ఏంజిల్స్ లో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారట.  అంతేకాదు,  ఓ అధునాతనమైన ఓడలో ఈ జంట వారి స్నేహితులకు పార్టీ కూడా ఇచ్చారట.  

గత సంవత్సరం కాలంగా ఈ జంట ప్రేమలో మునిగిపోయిన..ఇటీవల జరిగిన మెట్ గలా 2018 లో మీడియా కలిసి కనిపించారు.  ఆ తరువాత ఓ షిప్ లో పార్టీ ఇస్తూ కనిపించారు.  ముచ్చటగా మూడోసారి లాస్ ఏంజిల్స్ లో కలిసి మీడియాకు కనిపించారు.  దీంతో ఈ ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని..ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.  ఇక నిక్ జోనస్ 2009 లో డిస్నీ బ్యూటీ మిలే సైరస్ తో కొంతకాలం డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే.