అప్రమత్తమైన మోహన్‌బాబు ఫ్యామిలీ.. ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు

అప్రమత్తమైన మోహన్‌బాబు ఫ్యామిలీ.. ప్రైవేట్  సెక్యూరిటీ ఏర్పాటు

సినీన‌టుడు మోహన్‌బాబు ఫాంహౌస్ ద‌గ్గ‌ర కారు క‌ల‌క‌లం సృష్టించింది.. కారులో ఫాంహౌస్‌లోకి దూసుకెళ్లిన కొంద‌రు దుండ‌గులు.. మిమ్మ‌ల్ని వ‌ద‌‌ల‌మంటూ హెచ్చ‌రించ‌డం సంచ‌ల‌నంగా మారింది.. దీంతో.. అప్ర‌మ‌త్త‌మైన మంచు ఫ్యామిలీ.. ఫాంహౌస్‌తో పాటు హైద‌రాబాద్‌లోని ఇంటి ద‌గ్గ‌ర ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంది.. కాగా, మోహన్‌బాబుకు పహాడీషరీఫ్ పోలీసుస్టేషన్ పరిధిలో ఫాంహౌస్ ఉంది.. జల్పల్లిలోని ఆయన ఫాం హౌస్‌లోకి శ‌నివారం కొంతమంది దుండగులు కారులో దూసుకెళ్లి... మిమ్మల్ని విడిచిపెట్ట‌మంటూ వార్నింగ్ ఇవ్వ‌డం క‌ల‌క‌లంగా మారింది.. 

ఆ కారులు న‌లుగురు యువ‌కులు ఉన్న‌ట్టుగా చెబుతున్నారు.. ఈ మేరకు పహాడిషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా న‌మోదైంది. ఏపీ 31ఏఎన్‌ 0004 ఇన్నోవా కారులో దుండగులు వచ్చినట్లు మోహన్‌బాబు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు.. ఆ యువ‌కుల‌ను అదుపులోకి తీసుకున్నారు.. వీరంతా మైలార్‌దేవ్‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని దుర్గాన‌గ‌ర్ ప్రాంతానికి చెందిన‌వారిగా గుర్తించారు. అంద‌రూ 30 సంవత్సరాలలోపు వారేన‌ని చెబుతున్నారు పహాడీషరీఫ్ పోలీసులు. మ‌రి, ఫాంహౌస్‌లోకి ఎందుకు వ‌చ్చారు? వార్నింగ్ ఎందుకు ఇచ్చారు? లాంటి విష‌యాలు మాత్రం  పోలీసుల విచార‌ణ వెల్ల‌డికావాల్సి ఉంది.