ప్రైవేటు ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌

ప్రైవేటు ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌

మీరు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారా? ప్రభుత్వం ఉన్నత ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనుకుంటున్నారా? రెవెన్యూ, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఎకానమిక్ అఫైర్స్, అగ్రికల్చర్, కోఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, రోడ్ ట్రాన్స్‌పోర్ట్, హైవేలు, షిప్పింగ్, పర్యావరణం, అటవీ, వాతావరణ విభాగం, సివిల్ ఏవియేషన్, కామర్స్ లాంటి రంగాల్లో15 ఏళ్లకు పైగా అనుభవం ఉందా? ఐతే.. మీలాంటి వాళ్ల కోసమే ప్రభుత్వం ఓ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.  వివిధ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగావున్న 10 జూయింట్ సెక్రటరీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. 'లేటరల్ ఎంట్రీ' కింద ఈ పోస్టులను ఎంపిక చేస్తారు. నిబంధనల ప్రకారం అభ్యర్థికి తప్పనిసరిగా జూలై 1నాటికి 40 ఏళ్ల వయసుండాలి. డిగ్రీ పాస్ అయి ఉండాలి. 2018 లోపు అప్లయి చేసుకోవాలి. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఎంపికైన వారు కాంట్రాక్ట్ పద్ధతిలో మూడేళ్లు కేంద్ర ప్రభుత్వంతో పని చేయవచ్చు. నెలకు రూ.1,44,200 నుంచి 2,18,200 వరకు వేతనం ఉంటుంది. అలవెన్సులు అదనంగా ఇస్తారు. కేంద్రంలో ఇదే క్యాడర్ ఉద్యోగులకు అందే సదుపాయాలన్నీ వర్తిస్తాయ.