దారుణం : మృతి చెందిన గర్భిణిని అడవిలో చెట్టుకు కట్టేసి 

దారుణం : మృతి చెందిన గర్భిణిని అడవిలో చెట్టుకు కట్టేసి 


అరిష్టమంటూ అనాగరిక చర్యకు పాల్పడ్డారు కర్నూలు జిల్లా రుద్రవరం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామస్తులు. గర్భిణి మృతదేహాన్ని గ్రామంలో కాలిస్తే అరిష్టమంటూ ఊరవతల చెట్టుకు కట్టేశారు. ఈ ఆటవిక చర్య కర్నూలు జిల్లా రుద్రవరం మండలం నాగిరెడ్డిపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన ఓ నిండు గర్భిణీ ప్రసవ వేదనతో నంద్యాల ఆసుపత్రిలో చనిపోయింది. అంత్యక్రియల కోసం ఆమె మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు బంధువులు. అయితే కడుపులో బిడ్డ ఉండగా అంత్యక్రియలు చేస్తే గ్రామానికి అరిష్టమంటూ గ్రామస్తులు అడ్డుకున్నారు. చేసేది లేక బంధువులు గర్భిణీ మృతదేహాన్ని అడవిలోకి తీసుకెళ్లి చెట్టుకు కట్టేసి వచ్చేశారు. ఇది గమనించిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల జోక్యంతో గ్రామంలోనే గర్భిణీ మృతదేహానికి అంత్యక్రియలు చేశారు బంధువులు.