ఆ ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించాలి... ఎందుకంటే..?

ఆ ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించాలి... ఎందుకంటే..?

48 ఏళ్ల ముంబై లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాల్సి వస్తుంది. బీసీసీఐ నియమాల ప్రకారం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో సహా అన్ని రకాల దేశీయ క్రికెట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించినట్లయితే ఇతర దేశాలలో జరిగే టీ  20 లీగ్‌లలో ఆడాలనుకునే ఏ ఆటగాడికి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ లభిస్తుంది. కెనడాలో జరిగిన గ్లోబల్ టీ 20 లీగ్ ఆడటానికి వెళ్ళే ముందు యువరాజ్ సింగ్  కూడా అదే చేశాడు. అయితే  ఇప్పుడు తాంబే కు  కూడా  అదే పరిస్థితి ఏర్పడింది. కరేబియన్ ప్రీమియర్ లీగ్(సిపీఎల్) ప్లేయర్స్ డ్రాఫ్ట్ కోసం తన పేరును పంపించాడు తాంబే, కానీ భారత దేశీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించకపోతే బీసీసీఐ అతనికి సిపీఎల్ లో ఆడటానికి అనుమతి ఇచ్చే అవకాశం లేదు. అంతకముందు  అబుదాబిలో జరిగిన టీ 10 లీగ్‌లో పాల్గొని బీసీసీఐ నిబంధనలను ఉల్లంఘించినందుకే ఈ ఏడాది జరిగే ఐపీఎల్ లో అతడిని అనుమతించలేదు బీసీసీఐ. తన 41 సంవత్సరాల వయస్సులో ఐపీఎల్ అరంగేట్రం చేసిన తాంబే 33 మ్యాచ్‌లు ఆడి 30.5 సగటుతో 28 వికెట్లు పడగొట్టాడు.