సచిన్ వికెట్ కు బహుమతి...

సచిన్ వికెట్ కు బహుమతి...

భారత క్రికెట్లో దిగ్గజ ఆటగాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్. అయితే ప్రత్యర్థి బౌలర్లకు సచిన్  వికెట్ తీయడం అంటే గొప్పవిషయం. అందువల్ల టెండుల్కర్ వికెట్ తీస్తే తనకు బహుమతి ఇస్తామని అన్నారు అంటున్నాడు టీం ఇండియా స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా. ఐపీఎల్ లో డెక్కన్ చార్జర్స్ తరపున ప్రాతినిథ్యం వహించాడు ఓజా. 2009 ఐపీఎల్ లో తాను మంచి ప్రదర్శన ఇస్తున్న సమయంలో మా ఫ్రాంచైజ్ ఓనర్ నా దగ్గరకు  వచ్చి రేపు ముంబై  ఇండియన్స్ తో జరిగే మ్యాచ్ లో నువ్వు సచిన్ వికెట్ తీస్తే నీకు బహుమతి ఇస్తా అని తెలిపాడు. అయితే నాకు చిన్నప్పటినుండి వాచ్ లంటే ఇష్టం అందుకే నేను అతడిని వాచ్ కావాలని అడిగాను. ఇక మరుసటి రోజు జరిగిన మ్యాచ్ లో నిజంగానే నేను సచిన్ వికెట్ తీసుకున్నాను దాంతో అతను చెప్పిన విధంగానే నాకు వాచ్ గిఫ్ట్ ఇచ్చాడు అని తెలిపాడు. ఆ మ్యాచ్ లో ఓజా చెలరేగి సచిన్ వికెట్ తో పాటుగా మరో రెండు వికెట్లు తీసుకోవడంతో ముంబై ఓటమిపాలైంది.