ఫ్యాన్స్ కు పండగే .. ప్రభాస్ సినిమా ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది...

ఫ్యాన్స్ కు పండగే .. ప్రభాస్ సినిమా ఫస్ట్ లుక్  వచ్చేస్తుంది...

రెబల్ స్టార్ ప్రభాస్  రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఇది ప్రభాస్‌కు 20వ సినిమా. ‘ఓ డియర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది . రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ భారీ చిత్రానికి సంబంధించి అప్‌డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందా అని ఆత్రుతగా ఉన్నారు. మొత్తానికి వాళ్ల నిరీక్షణకు తెరపడే సమయం వచ్చింది. జులై 10 ఉదయం 10 గంటలకు ప్రభాస్ సినిమా ఫస్ట్  లుక్ ను విడుదల చేయనున్నారు చిత్రయూనిట్. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ ను డార్లింగ్ ప్రభాస్  తన ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమా  కూడా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది.  తెలుగు తమిళ్, హిందీ , మలయాళ భాషల్లో విడుదల కానుంది. ‘సాహో’ తరవాత వస్తోన్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.  గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.