జూన్ వ‌ర‌కూ దుబాయ్ షూట్‌లోనే..

జూన్ వ‌ర‌కూ దుబాయ్ షూట్‌లోనే..

ప్ర‌భాస్ - సుజీత్ బృందం ప్ర‌స్తుతం దుబాయ్‌లో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫ‌ర్‌, `ట్రాన్స్‌ఫార్మ‌ర్స్` ఫేం కెన్నీ బేట్స్ సార‌థ్యంలో అతిభారీ రిస్కీ యాక్ష‌న్ సీన్ల‌ను తెర‌కెక్కిస్తున్నారు. ఈ షూట్ కోసం దాదాపు 60రోజుల పాటు ప్ర‌భాస్&టీమ్ దుబాయ్‌లోనే మ‌కాం వేసి ఉన్నారు. ఇప్ప‌టికే ప‌లు కీల‌క యాక్ష‌న్ సీక్వెన్సులు తెర‌కెక్కించారు. ఇంకా భారీ ఛేజ్ స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తూనే ఉన్నారు. 

రిస్కీ షాట్స్ తెర‌కెక్కించేందుకు ముందే అనుకున్న స‌మ‌యం స‌రిపోలేద‌ని తెలుస్తోంది. ఆ క్ర‌మంలోనే మ‌రో రెండు వారాలు అద‌నంగా షూటింగ్ షెడ్యూల్‌ని పెంచార‌ట‌. జూన్‌లోనే సాహో టీమ్ ఇండియాకు తిరిగి వ‌స్తుందని తెలుస్తోంది. ప్ర‌స్తుతం భారీ స్పోర్ట్స్ బైక్‌లు, ల‌గ్జ‌రీ కార్లు, హిటాచీ ట్ర‌క్‌లు, కాట‌ర్‌పిల్ల‌ర్ ట్రక్స్‌తో భారీ ఛేజ్‌లు చిత్రీక‌రిస్తున్నారట‌. ఓ భారీ ట్ర‌క్ ఫ్లైఓవ‌ర్‌పై నుంచి జంప్ చేసేప్పుడు ప్ర‌భాస్ అందులోంచి స్కైలోకి జంప్ చేస్తాడ‌ట‌. ఆ సీన్ ఒళ్లు గ‌గుర్పొడిచేలా ఉంటుంద‌ని, సినిమాకే హైలైట్‌గా ఉంటుంద‌ని చెబుతున్నారు. రిస్కీ షాట్స్ కావ‌డంతో కెన్నీ బేట్స్‌ చిత్రీక‌ర‌ణ స్లోగా సాగుతోందిట‌. ఇక పెరుగుతున్న షెడ్యూల్స్‌కి త‌గ్గ‌ట్టే బ‌డ్జెట్ పెరుగుతోంద‌ని తెలుస్తోంది. ఇదివ‌ర‌కూ యు.వి.క్రియేషన్స్ సంస్థ‌ 225కోట్లు ఖ‌ర్చు చేస్తున్నామ‌ని చెబితే, అది ఇప్పుడు అమాంతం 300కోట్ల‌కు పెరిగిందిట‌. ప్ర‌భాస్‌ కాల్షీట్లు పెంచార‌ని తెలుస్తోంది.