అలాగైతే.. బాబు కాళ్ళు మొక్కుతా

అలాగైతే.. బాబు కాళ్ళు మొక్కుతా

తాను ఏ పార్టీలో చేరనని.. ఎలాంటి పదవీ కాంక్ష లేదని తెలిపారు ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి. తాను ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడనని... సొంత కొడుక్కే పార్టీ పెడుతున్నా అంటే.. వోటు వేయనని వెల్లడించారు. జగన్ ని కలవక ముందు నుంచే తాను బాబు గురించి ఇలాగే మాట్లాడానని.. ఇప్పుడు కొత్తగా ఆయనపై మాట్లాడటం లేదని ఆయన అన్నారు. అలాగే... తాను  చెప్పినంత మాత్రాన... జగన్ కి ఓటు వేయరని.. బాబు మీద కేస్ పెట్టె అవకాశం ఉంటే...పెడతానని ఆయన వివరించారు. 

గత ఎన్నికల్లో జగన్ కు మద్దతిచ్చి.. 'రుణమాఫీ ప్రకటన చేయండి అని జగన్ ని అడిగాను. కానీ అది సాధ్యం కాదని చెప్పారు. ఏపీలో రైతు రుణమాఫీ అయ్యి ఉంటే.. చూపించండి... బాబు కాళ్ళు మొక్కుతా. జగన్ లో స్పష్టత ఉంది' అని పోసాని కృష్ణమురళి  వివరించారు.