తప్పు చేశానని నిరూపిస్తే.. ఉరివేసుకుంటా

తప్పు చేశానని నిరూపిస్తే.. ఉరివేసుకుంటా

ఉత్తమ్, పొన్నాల హయాంలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విచారణ జరిపిస్తుందని వస్తున్న వార్తలపై మాజీ మంత్రి పొన్నాల స్పందించారు. భూముల కొనుగొలు వ్యవహారంలో ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తప్పు చేశానని నిరూపిస్తే.. అసెంబ్లీ ముందే ఉరి వేసుకుంటా అని గతంలోనే సవాల్ చేశానన్నారు. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి తప్పు చేయలేదు అని పొన్నాల అన్నారు. మూడు సంవత్సరాల తర్వాత కేసీఆర్ నోటా పొన్నాల మాటనా.. కేసీఆర్ కి పొన్నాల ఇప్పుడు గుర్తొచ్చాడు అని ఎద్దేవా చేశారు. కేసులు పెడతామని బయపెడితే భయపడే వాళ్ళం కాదు అని తెలిపారు. నాలుగు సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ నిజస్వరూపం బయటపడింది అని అన్నారు. ఉద్యమ సమయంలో ఆస్తులు సంపాదించిన నువ్వు.. సీఎం అయ్యాక ఏం చేసావో తెలియకుండా ఉన్నారా? అని ప్రశ్నించారు. మియాపూర్ భూముల కేసు ఎంతవరకు వచ్చింది.. నయిమ్ కేస్ ఏమైంది? దమ్ముంటే చర్చకు రమ్మని సవాల్ విసిరారు. కాంగ్రెస్ అంటే కేసీఆర్ కి భయం పట్టుకుంది అని తెలిపారు.