ఇరిగేషన్‌శాఖలో ఎందుకింత నిర్లక్ష్యం...

ఇరిగేషన్‌శాఖలో ఎందుకింత నిర్లక్ష్యం...

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు తొలిదశ పనుల్లో భాగంగా కొల్లాపూర్‌ కృష్ణా తీరంలోని ఎల్లూరు, రేగుమానిగడ్డలో జరుగుతున్న సొరంగ నిర్మాణ పనుల్లో జరిపిన బ్లాస్టింగ్‌లో కూలీలు మృతిచెందడంపై కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కాంట్రాక్టర్స్ సరైన సేఫ్టీమేజర్స్ తీసుకోకపోవడం వల్లే కూలీలు చనిపోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యాంగా పనులు చేస్తున్నారని ఆరోపించిన పొంగులేటి... చనిపోయిన కూలీలకు నష్టపరిహారంతో చేతులుదులుపుకోవాలని చూస్తున్నారని... ఇరిగేషన్ శాఖలో అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం? అని ప్రశ్నించారు. 

ఈ ప్రమాదంపై మంత్రి జూపల్లి కృష్ణారావు బాధ్యతారాహిత్యంగా సమాధానం చెబుతున్నారని మండిపడ్డారు పొంగులేటి... ఈ ఘటనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. సొరంగంలో ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ... ఏ రాష్ట్రం కూలీలు ఎంతమంది ఈ ప్రాజెక్ట్స్ లో పనిచేస్తున్నారో సర్కార్ వద్ద లెక్క ఉందా? అని ప్రశ్నించారు.