హైదరాబాద్‌లో పొలిటికల్ లీడర్ల వీధి పోరాటం...!

 హైదరాబాద్‌లో పొలిటికల్ లీడర్ల వీధి పోరాటం...!


లాక్‌డౌన్ వేళ హైదరాబాద్‌లో స్ట్రీట్‌ ఫైట్లు జరుగుతున్నాయి. బండ్లగూడ జాగీర్‌లో ఒక రాజకీయ పార్టీకి చెందిన స్థానిక నేతలు వీధి పోరాటానికి దిగడం చర్చనీయాంశమయింది. మందుల కోసం వచ్చిన ఇద్దరు యువకులు, తిరిగి వెళ్తున్న సమయంలో నేతల అనుచరులు వారిని అడ్డుకున్నారు. దీంతో యువకులు వారితో ఘర్షణకు దిగారు. ఆ సమయంలో అక్కడే ఉన్న స్థానిక నేతలు గొడవ సద్దుమణచడానికి బదులుగా, యువకులపై కర్రలతో దాడి చేశారు. దీనిపై స్థానికులు విచారణ జరుపుతున్నారు.  

మరో వైపు లంగర్‌హౌజ్‌లోనూ స్ట్రీట్ ఫైట్ జరిగింది. రెండు గ్యాంగులకు చెందిన వారు ఆడ, మగా తేడాలేకుండా నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. రెండు కుటుంబాల మధ్య మొదలైన గొడవ వీధి పోరాటానికి దారితీసింది. ఇరు వర్గాల వారు  కర్రలు, బ్యాట్‌లతో ఒకరిపై ఒకరు దాడిచేసుకుని కొట్టుకున్నారు.