పైన పుచ్చకాయలు..లోపల మందు - ఇలా దొరికేశారు !

పైన పుచ్చకాయలు..లోపల మందు - ఇలా దొరికేశారు !

ఏపీలో మద్యం రేట్లు భారీగా పెరిగిపోవడంతో తెలంగాణా సరిహద్దులలోకి వచ్చి తాగి వెళ్ళేవారు మందుబాబులు. అయితే ఇప్పుడు కొందరు మరో అడుగు ముందుకు వేసి ఏపీ టు తెలంగాణా మందు స్మగ్లింగ్ చేస్తూ దొరికేశారు. తెలంగాణ నుండి ఆంధ్రకి వయా పొందుగల మినీ వ్యానులలో పైన పుచ్చకాయలు కింద 5 లక్షలు విలువ కలిగిన అక్రమ మద్యం పెట్టి తరలిస్తుండగా పోలీసుల చేతికి చిక్కారు స్మగ్లింగ్ రాయుళ్ళు. దీంతో ఆ తరలిస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు పోలీసులు. అక్రమ మద్యం తరలింపునకు సంబంధించి మొత్తం 7 గురిని పోలీసులు గుర్తించారు.

స్పాట్ లో నలుగురు చిక్కగా వారి మీద సెక్షన్ 188,34(A) AP GAMING ACT కింద అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ కి తరలించారు, వీరిలో 3 (ఒకతను డ్రైవర్ మరియు ఓనర్, ఇతను అసలు సూత్రధారి) డ్రైవర్లు, ఒక హెల్పర్ ఉన్నారు. అంతేకాక ఈ వ్యవహారానికి సంబందించి మరో ముగ్గురిని గుర్తించారు అందులో ఒకరు నల్గొండ, ఇద్దరు గుంటూరుకి సంబంధించిన వ్యక్తులని తేలింది. విచారణ అనంతరం అక్రమ మద్యం తరలిస్తున్న 3 మినీ లారీలను వేలం నిమిత్తం ఎస్సైజ్ డిపార్ట్మెంట్ కి అప్పచెప్పారు. అయితే చాకచక్యంగా అక్రమ మద్యం పట్టుకున్న పోలీసులకు గుంటూరు రూరల్ ఎస్పీ  సీహెచ్.విజయరావు ఆ ఎస్ ఐ మరియు సిబ్బందికి రివార్డులు ప్రకటించారు.