ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచి రెడ్డి పై కేసు నమోదు.

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచి రెడ్డి పై కేసు నమోదు.

తనతో దుర్భాషలాడారని  మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు టీఆర్ఎస్,  ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి రంగారెడ్డి జిల్లా యాచారంలో రహదారి శంకుస్థాపనకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో పాల్గొనబోయిన ఎమ్మెల్యేను యాచారం ఎంపీపీ సుకన్య అడ్డుకోబోయారు. ఎమ్మెల్యే ప్రొటోకాల్‌ పాటించడం లేదని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి తనతో దురుసుగా ప్రవర్తించారని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. 

దళిత ఎంపిపి పై చేయి చేసుకోవడమే కాకుండా కులం పేరుతో దూషించి దళితులను అవమనపరిచారని ఎంపీపీ సుకన్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేకు సహకరించిన ఇబ్రహీంపట్నం ఏసీపీ, సీఐ నారాయణపై కూడా ఎంపీపీ ఫిర్యాదు చేశారు. ఎంపీపీ ఫిర్యాదు మేరకు వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.