హైదరాబాద్ లో పోలీస్ కు కరోనా పాజిటివ్ ..!

హైదరాబాద్ లో  పోలీస్ కు కరోనా పాజిటివ్ ..!

హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ లో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో హెడ్ కానిస్టేబుల్ తో ప్రైమరీ కాంటాక్ట్ అయిన 12 మంది పోలీస్ సిబ్బందిని అధికారులు క్వారంటైన్ కు తరలించారు.వారితో పాటు 10 మంది కుటుంబ సభ్యులను కూడా క్వారన్ టైన్ సెంటర్ కి తరలించారు. ప్రస్తుతం అందరికి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా కొనిస్టేబుల్ కు  ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని అధికారులు చెబుతున్నారు. అతడు ప్రార్ధనలో పాల్గొనడంతో కరోనా వచ్చి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. కాగా కానిస్టేబుల్  ఇంకా ఎవరెవరిని కలిసాడు అని దర్యాప్తు చేస్తున్నారు.