రంజాన్ రాకతో సబ్సిడీ గొర్రెలకు డిమాండ్

రంజాన్ రాకతో సబ్సిడీ గొర్రెలకు డిమాండ్

నిన్న రంజాన్ ఉపవాసాలు మొదలైన విషయం తెలిసిందే. ఈ రంజాన్ రాకతో సబ్సిడీ గొర్రెలకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. తెలంగాణ ప్రభుత్వం వృత్తిపరమైన చేయూతనివ్వాలనే లక్ష్యంతో గొల్ల కురుమలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం సబ్సిడీ గొర్రెలు. ఈ సబ్సిడీ గొర్రెలను పొందిన పలువురు లబ్ధిదారులు అవకతవకళకు పాల్పడుతున్నారు. సబ్సిడీపై అందిస్తున్న గొర్రెలను లబ్ధిదారులు తక్కువ ధరలకు విక్రయిస్తూ.. ఈ పథకంను పక్కదారి పట్టిస్తున్నారు. అయితే నిన్న రంజాన్ ఉపవాసాలు మొదలవడంతో ఈ సబ్సిడీ గొర్రెలకు భారీగా డిమాండ్ పెరిగింది. ఈ భారీ డిమాండ్ దృష్ట్యా లబ్ధిదారులు గొర్రెలను విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా బిర్పూర్ మండలంలో డిసిఎం వ్యాన్ లో అక్రమంగా 55 ప్రభుత్వ సబ్సిడీ గొర్రెలను తరలిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు తనికీలు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. డిసిఎం వ్యాన్ ను అదుపులోకి తీసుకుని సబ్సిడీ లబ్ధిదారులపై కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఈ సబ్సిడీ గొర్రెలను కొందరు విక్రయిస్తూ పట్టుపడ్డారు.