రాజధానిపై పిఎంవో జోక్యం పిట్టకథే..

రాజధానిపై పిఎంవో జోక్యం పిట్టకథే..

తెలకపల్లి రవి

 

 

అమరావతి నుంచి  కార్యనిర్వాహక రాజధానిని విశాఖ నుండి తరలించకుండా కేంద్రం అడ్డు పడుతుందనే కథు కొనసాగుతూనేవున్నాయి. అందులోనూ నేరుగా ప్రధాని కార్యాలయం (పిఎంవో)తో ముడిపెట్టి కొందరు మాట్లాడుతున్నారు. అయితే ఈ సమస్యపై కేంద్ర నాయకులు స్పందను  చూసినా రాజ్యాంగ నిబంధను చూసినా ఆ అవకాశం లేదని తేలిపోతుంది. రాజ్యాంగం మూడవ అధికరణం రాష్ట్రాలు ఏర్పాటు విభజనపై పార్లమెంటుకు అధికారం ఇచ్చింది గాని రాజధానిపై కాదు. అదే నిజమైతే రాష్ట్రం ప్రకటించినప్పుడే రాజదానిని కూడా చెప్పడం జరిగేది. సమాఖ్య  విధానంలో ప్రజులు  ఎన్నుకున్న శాసనసభ్యులువున్నప్పుడు వాటిని కాదని పార్లమెంటు రాష్ట్ర రాజధాని నిర్ణయించే బాధ్యత ఎందుకు నెత్తిన వేసుకుంటుంది?దానివలె ఆ వ్యయప్రయాసన్నీ కేంద్రం మోయవలసి వస్తుంది. వాటిపైవిమర్శు అసమానత వంటి అనేక సమస్యలు వెంటాడతాయి. పైగా శాసనసభ ఫలానా మార్పు చేయాలనుకున్నప్పుడు బల పర్చడం వ్యతిరేకించడం కేంద్రం తన నెత్తిన వేసుకుంటే తర్వాతి పర్యవసానాలు కూడా అదే బాధ్యత వహించాల్సి వస్తుంది. సాధారణ పరిస్థితుల్లోనే రాష్ట్రాల పట్ల పెద్ద స్పందన చూపనికేంద్రం ఇదంతా చేస్తుందని చూడటం తర్క విరుద్ధం.  అంతేగాక భారత రాజ్యాంగం దేశ  రాజధాని ఢిల్లీ విషయంలో ఎలాటి ప్రస్తావన నిర్దేశం చేయడం లేదన్న మాట సుప్రీం కోర్టులోనే ఒక కేసులో సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ ప్రస్తావించారు.ఎన్‌ఆర్‌సి ని అందుకు సమాధానంగా చెప్పినా ఆ  చట్టం వచ్చింది చాలా దశాబ్దాల తర్వాత అవసరాల కోసం మాత్రమే. రాష్ట్రాలు రాజధానుల విషయంలో కూడా ఇదే పరిస్థితి. ఒక  రాజదానినిర్ణయం నిర్మాణం మార్పు చేర్పు అన్నీ శాసనసభ పరిధిలోనే వుంటాయి. కేంద్రం దాన్ని అములు చేసి ప్రకటించడం మాత్రమే చేస్తుంది.

 

                ఆంధ్ర ప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని ఎంపిక చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా అతిశయాలు ప్రచారంలో పెట్టింది. జాతీయ అంతర్జాతీయ నగరంగా పెంచుతానని హంగామా చేసింది.ఇవన్నీ చూసి నేను భ్రమరావతి అన్నాను. నిజంగానే అది అలాగే మిగిలిపోయింది. కేంద్రం కూడా ఆశించిన ఆర్థిక సహాయం చేయలేదు. రైతు నుంచి ప్రభుత్వం  37 వేల ఎకరాలు భూమిని తీసుకుంది. ఈ క్రమంలో బోలెడు అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వస్తే భూములు  కొనుక్కొవడం తప్పు కాదని చంద్రబాబు సభలోనే సమర్తించారు. ఆ ప్రభుత్వ పదవీ కాలం ముగిసినా  ఎపి రాజధాని త్రిశంకు స్వర్గంలోనే వుండిపోయింది. కొత్తగా ఎన్నికైన జగన్‌ ప్రభుత్వం గతలో జరిగిన తప్పును సరిదిద్ది పూర్తి చేయడం గాక అక్కడనుంచి మార్చాల ని నిర్ణయించింది.ఇది ఎన్నిక ముందు చెప్పిన మాట కాదు. వాస్తవాలు చూశాక ఇలాటి నిర్ణయం తీసుకున్నామని వారంటారు,అమరావతిలో తక్కువగా కడితే వెనకబడినట్టవుతుంది. గొప్పగా కట్టడానికి నిధులు లేవన్నది ఈ ప్రభుత్వ ఆలోచన. పైగా చంద్రబాబు ప్రయోజనా రీత్యా ఎంచుకున్న ప్రదేశం తామెందుకు కొనసాగించానే రాజకీయ కోణం కూడా వుంది.

తరలించడం అంటే సమస్య గనక వికేంద్రీకరణ రాగం ఎత్తుకున్నారు. అక్కడ కట్టిన శాసనసభనూ కొనసాగిస్తూ హైకోర్టును కర్నూుకు తరలించి సచివాయం విశాఖలో ఏర్పాటు చేయాని అమరావతిలో సిఆర్‌డిఎ చట్టాన్ని రద్దు చేశారు. వికేంద్రీకరణ పేర మరో బ్లిు ఆమోదించారు. వాస్తవానికి చాలా రాష్ట్రాలో హైకోర్టు రాజధానిలో లేవు. వేసవి కా సభాభవనాు కూడా కొన్ని చోట్ల వున్నాయి.అంతమాత్రాన వాటిని రాజధాను అనడం లేదు. ఎపిలో కూడా వాస్తవంగా విశాఖపట్టణమే రాజధాని అన్నది ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టమైన ఆలోచన. అది కూడా వేగంగా విస్త్రతంగా కట్టేది వుండకపోవచ్చు. ఈ విషయమై సభలో బ్లిు ఆమోదం మండలిలో సెలెక్ట్‌ కమిటీ వివాదం ముగించుకుని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు పంపించారు గనక ఇప్పుడు రాజ్‌భవన్‌పై దృష్టి కేంద్రీకృతమైంది.
                  బ్లిుు ఆమోదించవద్దని టిడిపి.బిజెపి కాంగ్రెస్‌ సిపిఐ కోరాయి. ప్రభుత్వమే పునరాలోచించాని సిపిఎం చెప్పింది. రైతుకు న్యాయం జరగాని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. అమరావతి  గొప్ప నగరం కాబోతుంటే ఆపేసినట్టు టిడిపి చేసే వాదనతో చాలా మంది ఏకీభవించరు. అలాగే అక్కడ భూముపై పెట్టుబడి పెట్టిన రాజకీయ నేతు వ్యాపార వర్గాలే ఎక్కువ హడావుడి చేస్తున్నారన్నది కూడా కొంత వాస్తవం. అయితే మామూు రైతు స్థానిక ప్రజ సమస్యు కూడా వాస్తవం.వారి ఘోషను ఆలించి న్యాయం చేయాన్నది నిర్వివాదాంశం. సిఆర్‌డిఎ రద్దు తర్వాత అమరావతి మెట్రో డెవప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామంటున్నా గత అనుభవా రీత్యా దానిపై పెద్ద ఆశు లేవు. ఈ పరిస్థితులో  రాజధాని విషయమై మార్పుకు అవకాశమే లేదని ఒక వాదన, బ్లిుు ఆమోదించినా గవర్నర్‌ ఆపాని మరో అభ్యర్థన అసు కేంద్రం ఇందుకు అడ్డు చక్రం వేస్తుందనిమరో వాదనవినిపిస్తున్నాయి. వీటి నిజానిజాలేమిటి?
          ఏ ప్రభుత్వం వున్నా సభలో అత్యధిక మెజారిటీతో ఆమోదించిన బ్లిును గవర్నర్‌ నిరాకరించే  అవకాశం రాజ్యాంగంలో లేదు. 200 అధికరణం ప్రకారం కేంద్రంతో ఘర్షణ వుందంటే రాష్ట్రపతి పరిశీనకు పంపవచ్చు. ఇదే గవర్నర్‌ ఉభయసభ ప్రారంభ ప్రసంగంలో రాజధాని వికేంద్రీకరణను ప్రథమంగా ప్రస్తావించారు. కనుక 200 ఇక్కడ వర్తించదు. ఇక విభజన చట్టంలో ఒక రాజధాని( ఎ క్యాపిటల్‌) అనడం ఆటంకం అవుతుందనేది మరీ బహీనవాదన. ఇంగ్లీషులో ఆ ప్రయోగం సర్వసాధారణం. కేంద్రం సహాయం చేస్తుందని వుంది గనక వారి మాట కీకమనేది వితండవాదం, ఆ సహాయం చేసింది కూడా లేదు.  బిజెపి ముఖ్యనాయకు రాంమాధవ్‌.కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వంటివారే ఇది రాష్ట్ర పరిధిలోనిదని స్పష్టంగానే ప్రకటించారు.  రాయసీమను వేరు చేయాన్న స్థాయివరకూ బిజెపి వారు గత ంలోనే మాట్లాడారు.వివిధ కార్యాయాను వేర్వేరు చోట్ల పెట్టాని ఎప్పుడో తీర్మానంకూడా చేశారు.ఈ వాస్తవాన్నీ  కళ్లముందు వుండగా ప్రధాని కార్యాయం(పిఎంవో) దీనిపై ఆరాు తీస్తున్నట్టు కొందరు కథు చెప్పడం హాస్యాస్పదం. బహిరంగంగా జరుగతున్న దానికి ఆరాల అవసరమేమిటి?  దానికి పిఎంవోకు ఎన్నోమార్గాుండగా ఎవరో అనధికార అప్రధాన వ్యక్తుపై ఆధారపడవసిన అగత్యమేమిటి?టిడిపి నుంచి బిజెపిలో చేరిన సుజనా చౌదరి వంటివారు లేదా వైసీపీ నుంచి  బయిటకు వెళ్లిపోవానుకుంటున్న రఘరామకృష్ణం రాజు వంటివారు  రాేష్ట్రపతి ప్రఢాని కార్యాయం అడ్డుచక్రం వేస్తారని చెప్పడం బిజెపి నేతు తోసిపుచ్చుతున్నారు. టిడిపి భ్రమరావతి ఒకవైపు, వైసీపీ మూడు భ్రము మరోవైపు వుంటే బిజెపి ఏదో చేస్తుందనే మూడో భ్రమ వదడం బాధ్యతా రహితం.దీనికి ప్రచారం కల్పించే వారు కూడా భంగపాటుకు గురి కావసి రావచ్చు.బిజెపి వ్యూహంలోనే మార్పు వస్తే తప్ప.రాజ్యాంగ పరంగా గాని రాజకీయ వాస్తవా రీత్యా గాని  ఈ విషయంలో కేంద్రం జోక్యానికి ఆస్కారం లేదు.  

                ఆంధ్ర ప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని ఎంపిక చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా అతిశయాలు ప్రచారంలో పెట్టింది. జాతీయ అంతర్జాతీయ నగరంగా పెంచుతానని హంగామా చేసింది.ఇవన్నీ చూసి నేను భ్రమరావతి అన్నాను. నిజంగానే అది అలాగే మిగిలిపోయింది. కేంద్రం కూడా ఆశించిన ఆర్థిక సహాయం చేయలేదు. రైతు నుంచి ప్రభుత్వం  37 వేల ఎకరాలు భూమిని తీసుకుంది. ఈ క్రమంలో బోలెడు అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వస్తే భూములు  కొనుక్కొవడం తప్పు కాదని చంద్రబాబు సభలోనే సమర్తించారు. ఆ ప్రభుత్వ పదవీ కాలం ముగిసినా  ఎపి రాజధాని త్రిశంకు స్వర్గంలోనే వుండిపోయింది. కొత్తగా ఎన్నికైన జగన్‌ ప్రభుత్వం గతలో జరిగిన తప్పును సరిదిద్ది పూర్తి చేయడం గాక అక్కడనుంచి మార్చాల ని నిర్ణయించింది.ఇది ఎన్నిక ముందు చెప్పిన మాట కాదు. వాస్తవాలు చూశాక ఇలాటి నిర్ణయం తీసుకున్నామని వారంటారు,అమరావతిలో తక్కువగా కడితే వెనకబడినట్టవుతుంది. గొప్పగా కట్టడానికి నిధులు లేవన్నది ఈ ప్రభుత్వ ఆలోచన. పైగా చంద్రబాబు ప్రయోజనా రీత్యా ఎంచుకున్న ప్రదేశం తామెందుకు కొనసాగించానే రాజకీయ కోణం కూడా వుంది.