మరో విదేశీ పర్యటనకు సిద్ధమైన మోదీ

మరో విదేశీ పర్యటనకు సిద్ధమైన మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు... ఈ మధ్యే డ్రాగన్ కంట్రీ చైనాలో పర్యటించిన మోదీ... ఈ నెల 11, 12 తేదీల్లో నేపాల్‌లో పర్యటించనున్నారు. తన పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ... నేపాల్‌లోని చారిత్రాత్మక, అతి పురాతన నగరమైన జనక్‌పూర్‌ను సందర్శించనున్నారు. దీంతో జనక్‌పూర్‌లో ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసింది నేపాల్ ప్రభుత్వం. నేపాల్, భారత్ మధ్య మత విశ్వాసాలకు పునాది అయిన జనక్‌పూర్‌లోని ఆలయంలో భారత ప్రధాని పూజలు నిర్వహించనున్నారు. 

భారత ప్రధానిని ఘనంగా సన్మానించాలని నేపాల్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది... ఈ సందర్భంగా ఓ లక్ష మందితో సభ ఏర్పాటు చేస్తోంది... ప్రధాని మోదీ ఈ సభలో ప్రసంగంచనున్నారు. ఇక భారత ప్రధాని పర్యటన ఏర్పాట్లను సిద్ధం చేయడానికి ప్రధాన స్వాగత కమిటీని, ఐదు ఇతర కమిటీలను ఏర్పాటు చేసింది నేపాల్ ప్రభుత్వం... ప్రత్యేకంగా సమావేశమైన నేపాల్ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఇప్పటికే నేపాల్‌లోని భారత రాయబారి జనక్‌పూర్‌లో పర్యటించి అక్కడి అధికారులు, పూజారులతో చర్చలు జరిపారు.