నేడు భారత్-ఆసీస్ ప్రధానుల వర్చువల్ శిఖరాగ్ర సమావేశం...చైనానే లక్ష్యంగా కీలక చర్చలు

నేడు భారత్-ఆసీస్ ప్రధానుల వర్చువల్ శిఖరాగ్ర సమావేశం...చైనానే లక్ష్యంగా కీలక చర్చలు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో భారత్, ఆసీస్ ప్రధానులు చరిత్రలో తొలిసారిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు...ఈ రోజు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మొర్రిసన్‌తో భారత తొలి వర్చువల్ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశాన్ని పీఎం నరేంద్ర  మోడీ నిర్వహించనున్నారు...కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న ఇలాంటి క్లిష్ట తరుణంలో ఇరుదేశాల ఆర్థిక, వ్యూహాత్మక చర్చల్లో భాగంగా  వాస్తవానికి ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ ఈ ఏడాది జనవరిలోనే భారత పర్యటనకు రావాల్సి ఉంది...కానీ, ఆస్ట్రేలియాలో ఏర్పడ్డ భారీ కార్చిచ్చు ప్రభావంతో అది మే నెలకు వాయిదా పడింది...తాజాగా కరోనా వైరస్‌ ప్రభావంతో ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్స్‌‌కు పరిమితమైంది...

ప్రపంచంలో రెండు అగ్రదేశాలు చైనా-అమెరికా మధ్య వాణిజ్య యుద్దం...చైనా-భారత్‌ సరిహద్దు వివాదం చేలరేగి,బోర్డర్‌లో ఉద్రిక్తతలు నేలకొన్న ప్రస్తుత సమయంలో భారత్‌- ఆసీస్‌ దేశాల ప్రధానుల మధ్య ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం జరుగుతుండంలో ప్రపంచ దేశాలు ఇప్పుడు ఈ రెండు దేశాల వైపు చూస్తున్నాయి..మరో వైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ జీ7 సదస్సును రద్దు చేసి...భారత్‌-చైనా-రష్యాలను జీ7 దేశాలలోకి ఆహ్వనించడంతో...ఇప్పటికే ట్రంప్‌ ఆహ్వనాన్ని అసీస్‌ ప్రధాని స్వాగతించడంతో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం ప్రాధాన్యత సంతరించుకంది...2014 నవంబర్ 17 తేదీన ఆస్ట్రేలియా పార్లమెంటులో ప్రసంగించిన నరేంద్ర మోడి ఇరు దేశాల మధ్య సంబంధాలు దృఢతరం కావించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చాటారు...ఇండియాకు ఆస్ట్రేలియాతో ఉన్నట్లుగా అత్యధిక సినర్జీ ,ఇరు శక్తులు వేరు వేరుగా ఉన్న మొత్తం కంటే కలిసినప్పుడు ఇంకా ఎక్కువ శక్తి ఉత్పన్నం కావడం,ఉన్న దేశాలు ప్రపంచంలో చాలా తక్కువ అని మోడి ప్రకటించారు..

ప్రపంచంలోనే అత్యధిక యురేనియం నిల్వలున్న దేశం ఆస్ట్రేలియా. సెప్టెంబర్ నెలలో ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్ ఇండియా పర్యటించినప్పుడు ఇరు దేశాల మధ్య ‘పౌర అణు ఒప్పందం’ కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం యురేనియం ఇంధనాన్ని ఆస్ట్రేలియా సరఫరా చేయాలి... వైద్య ప్రయోజనాల కోసం రేడియో ఐసోటోపులు కూడా సరఫరా చేయాల్సి ఉంది...యురేనియంతో పాటు ఆస్ట్రేలియా నుండి బొగ్గునూ దిగుమతి చేసుకోవాలని భారత పాలకులు ఆశిస్తున్నారు...ఆస్ట్రేలియా బొగ్గు గనులను అభివృద్ధి చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నది భారతీయ పెట్టుబ్బడిదారుడు, మోడికి సన్నిహితుడు..ఆస్ట్రేలియాలో మోడి చెప్పిన మాటలు చూస్తే విషయం ఇంకాస్త స్పష్టం అవుతుంది. “మనం సముద్రాలపై కలిసి పని చేయాలి. అంతర్జాతీయ వేదికలపై సహకరించుకోవాలిఅన్ని దేశాలూ, అవి పెద్దవైనా చిన్నవైనా అంతర్జాతీయ చట్టాలకు, నిబంధనలకు కట్టుబడి ఉండాలి, తమ మధ్య ఎంత తీవ్రమైన వివాదాలు ఉన్నా సరే” అని మోడీ ప్రకటించారు.

చైనాకు వ్యతిరేకంగా అమెరికా అమలు చేస్తున్న మిలట్రీ ఆధిపత్య వ్యూహంలో ఇండో-పసిఫిక్ ప్రాంతం కీలకమైనదిగా అమెరికా పరిగణిస్తోంది... హిందూ మహా సముద్రంలో జల రవాణా మార్గాలను సైనికంగా చుట్టుముట్టి తద్వారా చైనాకు మధ్య ప్రాచ్యం నుండి జరిగే ఇంధన (పెట్రోలియం) సరఫరాను, ఆఫ్రికానుండి వచ్చే ఖనిజ సరఫరాను నియంత్రించాలన్నది అమెరికా పధకం. ఈ పధకానికి మోడి సంతకం చేసిన సెక్యూరిటీ ఫ్రేమ్ వర్క్ ఒప్పందం ఇతోధికంగా దోహదం చేస్తుంది...ఈ లొంగుబాటును సమర్ధించుకోవడానికి మోడి ‘పెద్దా, చిన్నా దేశాలన్నీ అంతర్జాతీయ చట్టాలు పాటించాలని’ బోధలు చేశాడు...

ఇప్పుడు తన ఉనికికి ముప్పు వస్తుందని గ్రహించిన అగ్రదేశ అధినేత ట్రంప్..చైనా పోటీని తట్టుకోలే చైనాను కట్టడి చేయడానికి అనేక కుయుక్తులు, ఎత్తుగడలు మొదలు పెట్టాడు...కరోనా కంటే ముందు సంవత్సరం నుంచే చైనాపై ట్రంప్‌ అనేక విమర్శలు చేస్తూ వచ్చారు...ఇప్పుడు కరోనా మహమ్మారి ట్రంప్‌కు ఒక ఆయుధానాన్ని అందించింది...కరోనాకు ముందు చైనాతో ఒంటరిగా పోరాడినా,రెండు దేశాల వాణిజ్య యుద్దంగా ఉంటే కరోనా తర్వాత ట్రంప్‌ దాన్ని రెండు దృవాల  దేశాల యుద్ధంగా మార్చారు..అమెరికా అనుకూల దేశాలు,చైనా అనుకూల దేశాలుగా మార్చాడు..


చైనాను ఆర్ధికంగా నష్టపరిచి దాని ఉనికిని దెబ్బతీయడానికి చైనాకు సరిహద్దులుగా ఉన్న దేశాలపై ట్రంప్‌ ఒత్తిడి తెస్తూ..సరిహద్దు వివాదాలను రెచ్చగోడుతుంది...ముఖ్యంగా ఆసియా ఖండంలో చైనా తర్వాత అంతటి ప్రభావితం కలిగిన భారత్‌ను చైనాతో ప్రశ్చన్న యుద్దంలో ట్రంప్‌ ఒక ఆయుధంగా మార్చుకుంటున్నాడు...ఈ నేపథ్యంలనే భారత్‌తో సరిహద్దు కలిగిన దేశాలలో ఉద్రికత్తలుకు ఆజ్యంపోసి తన ప్రణాళికలు అమలు చేసుకోవడానికి భారత్‌కు మద్దతూ ఇస్తున్నట్లు ప్రకటిస్తున్నారు...దక్షిణా చైనా సముద్రంలో అమెరికా ప్రత్యేక్షంగా అడుగుపెట్టడానికి అవకాశం లేక పోవడంతో ఇప్పుడు భారత్‌-ఆసీస్‌ మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా తన లక్ష్యాలను నేరవేర్చుకోవాలని కాంక్షిస్తున్నారు..

ప్రస్తుత తరణంలో భారత్‌ ఆచితూచి నిర్ణయాలు తీసుకోకపోతే ముందు తరానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది...చైనా-అమెరికా మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్‌ను మనకు అనుకూలంగా మల్చుకోని దేశ ప్రజల అభివృద్దికి ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకుంటే మందు తరానికి మంచి భవిష్యత్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది...ఇప్పుడు భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఒప్పందాలు ఆ వైపుగా ఉండేలా కన్పించడం లేదు..కేవలం భారత్‌కు నష్టం కలిగిలే గతంలో చేసుకున్న... ఇండో-పసిఫిక్ ప్రాంతం, అణు ఒప్పందాలు,బోగ్గు ఉత్పత్తులపై,వ్యవసాయ,పాడి రంగాలపై కీలక చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి..