స‌ర్పంచ్ నుంచి ప్ర‌ధాని వ‌ర‌కు ఎవ‌రూ అతీతులు కారు-మోడీ

స‌ర్పంచ్ నుంచి ప్ర‌ధాని వ‌ర‌కు ఎవ‌రూ అతీతులు కారు-మోడీ

ఓ గ్రామ స‌ర్పంచ్ నుంచి ప్ర‌ధాని వ‌ర‌కు ఎవరూ కరోనా “లాక్ డౌన్” నియమనిబంధనలకు అతీతులు కారు అని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఇవాళ దేశ‌ప్ర‌జ‌ల‌నుద్దేశించి ప్ర‌సంగించిన ఆయ‌న‌.. పంచాయతీ ప్రెసిడెంట్ నుంచి ప్రధాని వరకు, అందరూ విధిగా నియమాలను పాటించాల్సిందేన‌న్నారు.. ముఖ్యంగా కంటైన్మెంట్ జోళ్ల విష‌యంలో చాలా శ్రద్ధ వహించాల‌న్నారు. నియమాలు పాటించకపోతే  కరోనా కారణంగా వచ్చే అనర్థాలను ప్రజలకు వివ‌రించాల‌ని సూచించారు ప్ర‌ధాని.. ఇక‌, ప్రపంచంలో అనేక దేశాలతో పోలిస్తే మన దేశంలో మరణాల రేటు చాలా తక్కువగా ఉంది... సరైన సమయంలో లాక్‌డౌన్‌, ఇత‌ర నిర్ణ‌యాల‌తో లక్షలాది ప్రాణాలు కాపాడాం.. అయితే, అన్‌లాక్ ప్రారంభ‌మైన‌నాటి నుంచి ప్ర‌జ‌ల్లో కొంత నిర్ల‌క్ష్యం పెరిగింద‌న్నారు. ఎక్కువ జాగ్రత్తగా ఉండవలసిన సమయంలో నిర్లక్ష్యం చాలా ఆందోళన కలిగించే విష‌య‌మ‌న్న ప్ర‌ధాని..  ఇప్పుడు మళ్ళీ అందరం జాగ్రత్త వహించవలసిన సమయం వ‌చ్చింద‌న్నారు.  మనం చూశాం. ఒక దేశ ప్రధానమంత్రికే మాస్క్ వేసుకోనందుకు జరిమానా వేశారు. మనం కూడా అలాగే ఉండాలి. గ్రామ సర్పంచ్ అయినా దేశ ప్రధానమంత్రి అయినా నిబంధనాలకి అతీతం కాదు అని స్ప‌ష్టం చేశారు.