రేపు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ ... ఏం మాట్లాడబోతున్నారు?

రేపు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ ... ఏం మాట్లాడబోతున్నారు?

దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న సమయంలో అన్ని రాష్ట్రాలు ఈ విషయంపై సీరియస్ గా వ్యవహరిస్తున్నాయి.  మిగతా విషయాలు అన్నింటిని పక్కన పెట్టి కరోనా వైరస్ ను కట్టడి చేయడం మీదనే అన్ని ప్రభుత్వాలు దృష్టి సారించాయి.  ఒకరి కాదు రెండు కాదు ప్రపంచంలోని 202 దేశాలపై కరోనా ప్రాభవం చూపుతున్నది.  ఇప్పటి ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒకసారి వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు.  

కాగా, రేపు మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహిస్తున్నారు.  ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో ఏ విషయాల గురించి చర్చించబోతున్నారు అన్నది ఆసక్తి కరంగా మారింది.  ఈరోజు కేంద్ర కేబినేట్ కార్యదర్శి అన్ని రాష్ట్రాల సీఎస్ లు, డీజీపీలతో వీడియో కాన్ఫెరెన్స్ ను నిర్వహించారు.  మార్కజ్ లో జరిగిన ప్రార్థనలకు హాజరైన అందరిని యుద్దప్రాతిపధిక ట్రేస్ చేయాలనీ, వారికి టెస్ట్ లు నిర్వహించాలని కోరారు.  అలానే కేంద్రం ప్రకటించిన గరీబ్ కళ్యాణ్ పధకాన్ని వారం రోజుల్లోగా అమలు చేయాలని సూచించింది.  లాక్ డౌన్ విషయంలో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కూడా కేంద్రం ఆదేశించింది. 

ఈరోజు కేబినెట్ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం, రేపు ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించబోతుండటంతో ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.  లాక్ డౌన్ చేసి కరోనాను చాలా వరకు కంట్రోల్ చేయగలిగింది.  రేపు జరిగే వీడియో కాన్ఫెరెన్స్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో చూడాలి.