తెలుగులో ప్రధాని ఉగాది శుభాకాంక్షలు

తెలుగులో ప్రధాని ఉగాది శుభాకాంక్షలు

తెలుగు రాష్టాల్లో... తెలుగు సంవత్సరాది ఉగాదిని జరుపుకుంటున్నారు ప్రజలు... ఓ వైపు లాక్ డౌన్ కొనసాగుతుండగా.. హంగు ఆర్భాటాలు లేకుండా.. పండుగ జరుపుకుంటున్నారు.. ఇక, తెలుగు ప్రజలకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోడీ. తెలుగు సంవత్సరాన్ని పురస్కరించుకొని... తెలుగులోనే ట్వీట్ చేసిన మోడీ.. "ఉగాదితో  కొత్త సంవత్సరం ఆరంభం అవుతోంది. ఈ సంవత్సరం ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చి, కష్టాలను అధిగమించే నూతనశక్తిని ప్రసాదిస్తుందని ఆశిస్తున్నాను. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ముఖ్యంగా ఆరోగ్యంతో వుండాలని ప్రార్ధిస్తున్నాను.'' అంటూ ట్వీట్ చేసారు.