ముక్తినాథ్ ఆలయంలో మోడీ పూజలు

ముక్తినాథ్ ఆలయంలో మోడీ పూజలు

ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల నేపాల్ పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయాన్నే ముక్తినాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక  పూజలు నిర్వహించారు. బౌద్ధ సంప్రదాయంలో ఎర్రటి వస్త్రాన్ని ధరించి అటు బౌద్ధం, ఇటు హిందూ సంప్రదాయం ప్రకారం జరిపిన పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత అక్కడ కళాకారులతో డబ్బు వాయిస్తూ మోడీ కళాకారులకు ప్రోత్సాహాన్నిఇచ్చారు. అలాగే ఈ రోజు ఖాట్మండులోని పశుపతినాథ్ ఆలయాన్ని కూడా మోడీ సందర్శించనున్నారు.

ఆ తర్వాత నేపాల్ లోని కీలక నాయకులతో జరిపే చర్చల్లో పాల్గొంటారు. ఖాట్మండు మెట్రో పాలిటన్ సిటీ నిర్వహించే రిసెప్షన్ లో పాల్గొన్న తర్వాత ప్రధానమంత్రి మోడీ తిరిగి ఢిల్లీకి ప్రయాణం అవుతారు. ప్రధాని పర్యటన కారణంగా నేపాల్ లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.