ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తి వేసే ఆలోచన లేదు : మోడీ

ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తి వేసే ఆలోచన లేదు : మోడీ

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగిస్తారా, లేదా ? ఈ అంశంపై కేంద్రప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రతిపక్షనేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ.. లాక్ డౌన్ పై కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 14న 'లాక్‌డౌన్' ఎత్తివేసే ఆలోచన లేదని.. ఒకేసారి లాక్‌డౌన్ ఎత్తివేయలేమని ఈ మీటింగ్ లో ప్రధాని వ్యాఖ్యానించినట్లు సమాచారం. కరోనా కారణంగా పరిస్థితులు మునపటిలా లేవని.. లాక్‌డౌన్‌పై వస్తున్న పలు సూచనలు, సలహాలు పరిశీలిస్తున్నట్లు మోదీ వ్యాఖ్యానించారు. 


అఖిలపక్ష నేతలతో సమావేశంలో మోదీ వ్యాఖ్యల్ని బట్టి.. లాక్ డౌన్ పొడిగింపునకే  కేంద్రం మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. లాక్‌డౌన్ పొడిగించాలని ఇప్పటికే కేంద్రానికి పలు రాష్ట్రాల విజ్ఞప్తులు చేశాయి. తెలంగాణ సీఎం కేసీఆర్  కూడా లాక్ డౌన్ పొడిగించడమే మంచిదని అభిప్రాయపడ్డారు.  ఏప్రిల్ 11న అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మరోసారి వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఆ సమావేశం తర్వాత లాక్ డౌన్ కొనసాగింపుపై  తుదినిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.