సింగపూర్‌ మాజీ దౌత్యవేత్తకు పద్మశ్రీ ప్రదానం

సింగపూర్‌ మాజీ దౌత్యవేత్తకు పద్మశ్రీ ప్రదానం

భారత అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డును సింగపూర్‌కు చెందిన మాజీ దౌత్యవేత్త ప్రొఫెసర్‌ టామీ కోహ్‌ ఇవాళ అందుకున్నారు. సింగపూర్‌లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ అవార్డును అందజేశారు. ఇండియా-ఆసియాన్‌ భాగస్వామ్యం 25 సంవత్సరాలు పూర్తిచేసుకోవడం, భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది జనవరిలో టామీ  కోహ్‌కి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించారు. టామీ కోహ్‌ ప్రస్తుతం ఆయన సింగపూర్‌ నేషనల్‌ వర్శిటీలో సెంటర్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ లా గవర్నర్ల బోర్డుకు ఛైర్మన్‌గా సేవలందిస్తున్నారు.