ఒడిశాకు రూ.500 కోట్ల ఆర్థికసాయం ప్రకటించిన మోడీ

ఒడిశాకు రూ.500 కోట్ల ఆర్థికసాయం ప్రకటించిన మోడీ

అంఫన్‌ తుఫాన్ అటు పశ్చిమ బెంగాల్.. ఇటు ఒడిశాను అతలాకుతలం చేసింది.. ఇవాళ అంఫన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన పరిస్థితిని పరిశీలించిన ప్రధాని నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రూ.1000 కోట్ల ప్యాకేజీ ప్రకటించారు.. ఇక, సాయంత్రం ఒడిశాలో ఏరియల్ సర్వే నిర్వహించిన ప్రధాని మోడీ... తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.. ఈ సందర్భంగా ఒడిశాకు రూ.500 కోట్ల ఆర్థికసాయం ప్రకటించారు.. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మోడీ.. గాయపడినవారికి రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని వెల్లడించారు. తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన తర్వాత ఆయా రాష్ట్రాల సీఎంలతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు మోడీ. ఇక, అంఫన్‌ తుపాన్‌తో ఒడిశాలో విధ్వంసమే సృష్టించింది.. అనేక తీరప్రాంత జిల్లాల్లో విద్యుత్ మరియు టెలికాం మౌలిక సదుపాయాలను దెబ్బతీసింది. రాష్ట్రంలో సుమారు 44.8 లక్షల మంది ప్రజలను ప్రభావితం చేసినట్లు అంచనా వేశారు ఒడిశా అధికారులు.