బాబు దిగజారి మాట్లాడుతున్నారు...పేర్ని ఫైర్

బాబు దిగజారి మాట్లాడుతున్నారు...పేర్ని ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కరోనా వైరస్‌ను ప్రభుత్వం నియంత్రించలేక పోతోందని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అంతర్జాతీయ ఉగ్రవాదికి చంద్రబాబుకు తేడా ఏమీ లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. వైరస్‌ విస్తృతిపై వాస్తవాలు దాయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు పేర్ని నాని. కరోనా పేరుతో  చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. కరోనా వైరస్‌ రాష్ట్రంలో ఎక్కడ ప్రబలిందో బాబు చెప్పాలని ఆయన అడిగారు. చంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలో కూర్చొని విమర్శలు చేయడం సరికాదని అన్నారు. కరోనా వైరస్‌ నివారణకు తాము కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వైరస్‌ నివారణకు కర్ఫ్యూ, లాక్‌డౌన్‌తో పటిష్ట చర్యలు చేపడుతున్నామని అన్నారు. చంద్రబాబు అనవసరంగా ప్రభుత్వంపై నిందలేస్తున్నారని.. రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రబలితే టీడీపీ నేతలకు సోకాలి కదా అని పేర్ని నాని ప్రశ్నించారు. కరోనా వైరస్‌ సోకితే ప్రభుత్వం వైద్యం చేయిస్తుందని, ఇందుకు ప్రతి నియోజకవర్గంలో క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు.