ఎల్జీ పాలిమర్స్ వద్ద ఉద్రిక్తత ... పోలీసులు, మంత్రులను అడ్డుకున్న గ్రామస్తులు...!!

ఎల్జీ పాలిమర్స్ వద్ద ఉద్రిక్తత ... పోలీసులు, మంత్రులను అడ్డుకున్న గ్రామస్తులు...!!

విశాఖపట్నం జిల్లాలోని గోపాలపట్నం వద్ద ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి లీకైన స్టెరిన్ గ్యాస్ వలన దాదాపుగా 12 మంది మరణించారు.  అనేక మంది అస్వస్థతకు గురయ్యారు.  గతంలో రెండుసార్లు ఈ కంపెనీలో ప్రమాదం సంభవించింది.  భద్రతా ప్రమాణాలు తీసుకున్నామని చెప్తున్నా ఎందుకు ప్రమాదం జరిగింది అనే దానిపై ప్రస్తుతం విచారణ జరుగుతున్నది.  

అయితే, ప్రమాదంలో మరణించిన వ్యక్తులు సంబంధించిన బంధువులు, వెంకటాపురం గ్రామ ప్రజలు ఫ్యాక్టరీ వద్దకు చేరుకొని ఆందోళన చేస్తున్నారు.  ఒక దశలో కంపెనీ గేటు దాటుకొని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ, పోలీసులు అడ్డుకోవడంతో గేటు బయట ఆందోళనకు దిగారు.  అయితే, ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వద్దకు వెళ్లిన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను, మంత్రులను బాధితులు అడ్డుకున్నారు.  తమకు న్యాయం చేయాలనీ, కంపెనీని అక్కడి నుంచి తరలించాలని ఆందోళన చేస్తున్నారు.  దీంతో అక్కడ పరిస్థితులు ఆందోళన కరంగా మారిపోయాయి.