నిబంధనలు గాలికి వదిలేసి .. బస్సులో 74 మంది...

నిబంధనలు గాలికి వదిలేసి .. బస్సులో 74 మంది...

కరోనా ప్రమాదకరంగా విస్తరిస్తున్న సమయంలోనూ కందరు ప్రజలతీరు మారలేదు. రెండు రోజుల క్రితమే ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కిన విషయం తెలిసిందే.నిబంధనలు పాటిస్తూ బస్సులో ప్రయాణించాలని ప్రభుత్వం కోరుతున్న జనం పట్టించుకోవడంలేదు. భౌతిక దూరాన్ని పాటించమని సర్కార్ చెప్తున్నా ప్రజలు ఆ మాటలను గాలికొదిలేస్తున్నారు.  కండక్టర్ చెప్తున్నా వినకుండా బస్సులో ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణించారు. మెదక్‌-జోగిపేట- సంగారెడ్డి మీదుగా పటాన్‌చెరు వెళ్లే సంగారెడ్డి డిపో బస్సులో బుధవారం 74 మంది ఒకే సారి ప్రయాణించారు. అంతమంది ఒకే దగ్గర ఉండటంతో ఏ వైపునుంచి కరోనా వ్యాపిస్తుందో తెలియక కొందరు భయబ్రాంతులకు గురయ్యారు. ప్రజలు ఇలా బాధ్యత మరిచి ప్రవర్తించడం పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.