20 నుంచి పవన్‌ పోరాట యాత్ర

20 నుంచి పవన్‌ పోరాట యాత్ర

ఉద్యమాలకు పుట్టినిల్లు అయిన శ్రీకాకుళం జిల్లా నుంచి తన బస్సు యాత్రను ప్రారంభిస్తున్నానని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ఇవాళ విశాఖపట్నంలో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ  20న ఇచ్చాపురం నుంచి  యాత్ర ప్రారంభమవుతుందని పవన్‌ చెప్పారు. ఉత్తరాంధ్రలో దాదాపు 45 రోజులు ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. జన సేత మేనిఫెస్టో టీమ్‌ కూడా బస్సు యాత్రలో పాల్గొంటుందన్నారు. అలాగే.. ప్రత్యేక హోదాపై 175 నియోజకవర్గాల్లోనూ నిరసన కవాతు నిర్వహిస్తామని పవన్‌ చెప్పారు. ఉత్తరాంధ్ర వెనుకబాటు ఇలాగే కొనసాగితే ప్రాంతాల మధ్య విద్వేషాలు చెలరేగుతాయని పవన్‌ అన్నారు. కొంతమంది పాలకు నిర్లక్ష్యానికి ప్రజలు నష్టపోతున్నారని పేర్కొన్నారు.  వెనుకబాటుతనం ప్రజలకేగాని నాయకులకు లేదని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు.