ఐపీఎల్ ను అడ్డుకునేందుకు పీసీబీ విశ్వ ప్రయత్నాలు...మరో కొత్త వాదన తెరపైకి... 

ఐపీఎల్ ను అడ్డుకునేందుకు పీసీబీ విశ్వ ప్రయత్నాలు...మరో కొత్త వాదన తెరపైకి... 

ఈ ఏడాది మార్చి 29 న ఐపీఎల్ జరగాల్సి ఉంది కానీ కరోనా మహమ్మారి కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. అయితే ఈ ఏడాది ఎలాగైనా ఐపీఎల్ నిర్వహించాలని చూస్తున బీసీసీఐ దానిని విదేశాలలో జరపాలని అనుకున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఈ టోర్నీని నిర్వహించడానికి శ్రీలంక అలాగే యూఏఈ పోటీలో ఉన్నట్లు వెల్లడించారు. ఇక తన ఏప్రిల్, మే విండోను కోల్పోయిన ఐపీఎల్ ను అక్టోబర్-నవంబర్ సమయంలో నిర్వహించాలని చూస్తుంది. కానీ ఆ సమయం లో ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆ టోర్నీ జరిగే అవకాశాలే కనిపించక పోవడంతో ఐపీఎల్ ఆ విండోలో జరగడం ఖాయమైంది. ఒకవేళ ఐపీఎల్ జరగకపోతే 4000 కోట్ల నష్టం వస్తుంది అని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఇంతకముందు తెలిపారు. 

ఇక ఐపీఎల్ ను అడ్డుకునే విధంగా పీసీబీ పావులు కదుపుతుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్  పర్యటనలో ఉన్న మా జట్టు సెప్టెంబర్ 2 న తిరిగి వస్తుంది. అక్టోబర్-నవంబరులో ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ జరగకపోతే మేము ఆ సమయం లో ఆసియా కప్ నిర్వహించాలని చూస్తున్నాము అని పీసీబీ తెలిపింది. ఇక తాజాగా ఆసియా కప్ ముగిసిన తర్వాత మధ్యలో నిలిచిపోయిన పాకిస్థాన్ సూపర్ లీగ్ నవంబరులో జరపాలని అనుకుంటున్నట్లు తెలిపింది పీసీబీ. అయితే ఐపీఎల్ లో ఆడే చాల మంది ఆటగాళ్లు  పీఎస్‌ఎల్ లో కూడా ఆడుతారు. ఇక  పీసీబీ ఈ వరుస ప్రకటనలు చూస్తుంటే... ఎలాగైనా ఐపీఎల్ ను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అని అర్ధమవుతుంది.