59 యాప్స్‌పై బ్యాన్.. ఇలా స్పందించిన పేటీఎం..

59 యాప్స్‌పై బ్యాన్.. ఇలా స్పందించిన పేటీఎం..

స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌తో.. చైనాపై డిజిట‌ల్ ఉద్య‌మానికి తెర‌లేపింది భార‌త్.. అందులో భాగంగా.. చైనాకు సంబంధించిన 59 యాప్స్‌ను బ్యాన్ చేసింది.. దీనిపై ఇప్ప‌టికే చైనా, టిక్‌టాక్ కూడా స్పందించాయి.. తాజాగా, ఈ వ్య‌వ‌హారంపై రెస్పాండ్ అయిన పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ.. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ప్ర‌క‌టించారు.. టిక్‌టాక్ వంటి ఇత‌ర దేశాల యాప్‌ల‌ను భార‌త్‌లో నిషేధించ‌డం.. దేశ ప్ర‌యోజ‌నాల విష‌యంలో తీసుకున్న ఓ సాహ‌సోపేత నిర్ణ‌యంగా అభివ‌ర్ణించిన ఆయ‌న‌.. భారత్‌ స్వయం సంమృద్ధి సాధించే దిశగా ముందుకు వెళ్తుంద‌ని పేర్కొన్నారు.. భారత పారిశ్రామికవేత్తలు ప్రజలకు కొత్త ఆవిష్కరణలు అందించాల్సిన సమయం ఇదే అని పేర్కొన్నారు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ.. కాగా, పేటీఎంను భారత సంస్థ నిర్వ‌హిస్తుండ‌గా.. ఇందులో చైనా కంపెనీలైన అలీబాబా, యాంట్‌ ఫైనాన్స్‌ సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టాయి. ఆ త‌ర్వాత ప‌రిణామాలు ఏంటో చూడాలి మ‌రి.