నేడు తిరుచానూరుకు పవన్‌

నేడు తిరుచానూరుకు పవన్‌

తన మూడు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించుకున్న జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌.. ఇవాళ తిరుచానూరు వెళ్తున్నారు. ఉదయం తిరుచానూరు చేరుకుని.. పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం పద్మావతి కల్యాణమండపంలో స్థానిక చిరు వ్యాపారులతో సమావేశమవుతారు. 9 నుంచి 10 గంటలకు ఈ సమావేశం ముగిశాక శెట్టిపల్లి గ్రమంలో పవన్‌ పర్యటిస్తారు. అక్కడ భూనిర్వాసితులతో సమావేశమవుతారు.