ఈ నెల 13 నుంచి పవన్ కల్యాణ్ టూర్...

ఈ నెల 13 నుంచి పవన్ కల్యాణ్ టూర్...

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలని నిలదీయాలని నిర్ణయించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఈ నెల 13వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో తన పర్యటన ఉంటుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే ఈ పర్యటన ఎలా సాగుతోంది... ఎక్కడి నుంచి ప్రారంభం కానుందనేది ఈ నెల 11వ తేదీన ప్రకటించనున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన పవన్... తెలంగాణలో పార్టీ క్యాడర్ బలంగా ఉన్న స్థానాల్లో  పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ నెల 13వ తేదీ నుంచి ఏపీలో పర్యటించనున్న పవన్... ప్రతీ నియోజకవర్గంలో రోడ్‌షోలు, ముఖ్యమైన పట్టణాలలో పాదయాత్రలు చేయాలని నిర్ణయానికి వచ్చారు.