2009లోనే కేంద్రమంత్రిని అయ్యేవాడిని..?

2009లోనే  కేంద్రమంత్రిని అయ్యేవాడిని..?

శ్రీకాకుళంలో జరుగుతున్న జనపోరాట యాత్రలో భాగంగా ఆయన ఇవాళ పాలకొండలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. శ్రీకాకుళం నేల తల్లికి పాదాభివందనాలని.. పాలకొండ స్కూళ్లో వీరఘట్టం కోడిరామమూర్తిగారంటే తనకు చాలా ఇష్టమని. ఆయన స్పూర్తితోనే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నానని అన్నారు. శ్రీకాకుళం జిల్లా వెనుకబడటానికి కారణం ఉద్యోగాలు,  సాగు, తాగునీరని.. తెలంగాణ విడిపోవటానికి ముఖ్యకారణం నీళ్లు, నిధులు, నియామకాలని.. నాడు హైదరాబాద్‌లో జరిగిన విధంగానే నేడు.. అమరావతిలో చేస్తున్నారని పవన్ విమర్శించారు.

పుష్కరాలకు ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టే ముఖ్యమంత్రి.. తోటపల్లికి మాత్రం నిధులు ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ఖజనా మొత్తం అమరావతికే ఖర్చు పెడుతూ.. ఉత్తరాంధ్రని నిర్లక్ష్యం చేస్తున్నారని జనసేనాని ఆరోపించారు. తాను సినిమాల్లోకి రాకముందు.. గిరిజన ప్రాంతాలపై అధ్యయనం చేశానని.. కానీ నేటి ప్రభుత్వం అడవిబిడ్డల బాధలు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. తాను టీడీపీ నుంచి చిన్నసాయం కూడా పొందలేదని.. తనపై దాడి చేయించటం బాధ కలిగించిందన్నారు. 2019లో జనసేన ప్రభుత్వం వస్తుందని.. తమ ప్రభుత్వం మహిళలకు, అంగవైకల్యం కలవారికి, గిరిజనులకు అండగా ఉంటుందని.. ప్రత్యేకహోదా ఉద్యమాన్ని మరింత ఉదృతంగా ముందుకు తీసుకువెళతామని పవన్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ సరిగ్గా పొందటం లేదని... తన తండ్రి ఏనాడు లంచం తీసుకోలేదని.. ఉద్యోగులు జనసేనకు మద్ధతుగా ఉంటే.. అధికారంలోకి రాగానే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 2009లో తాను పోటీ చేసుంటే ఆ ఏడాదే ఎమ్మెల్యేగా గెలిచి.. 2014లో ఖచ్చితంగా కేంద్రమంత్రిని అయ్యేవాడినని.. కానీ తనకు పదవుల మీద వ్యామోహం లేదని.. ప్రజల సమస్యలు తీర్చడమే తన ముందున్న బాధ్యత అని పవన్ అన్నారు.