ఆయన వెన్నుపోటు పొడిచే రకం..

ఆయన వెన్నుపోటు పొడిచే రకం..

ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఉద్దానం బాధితుల సమస్యలపై ఒక రోజు దీక్ష చేపట్టిన పవన్... దీక్ష విరమణ సందర్భంగా 'ముందు కౌగలించుకుని... వెనుక నుంచి బాకులతో పొడిచే సంస్కృతి' చంద్రబాబుదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం వెనుకబడిన ప్రాంతం కాదు... వెనక్కి నెట్టబడిన ప్రాంతమన్న జనసేనాని... మనరాష్ట్రంలో రెండో కోనసీమ ఉద్ధానం అన్నారు. నాకు నిజంగా రాజకీయగుర్తింపే కావాలంటే టీడీపీకి మద్దతివ్వాల్సిన అవసరమేంటి? అని ప్రశ్నించిన పవన్... నాకు గుర్తింపు ఒకరు ఇవ్వనవసరం లేదన్నారు. రూ. 2 వేల కోట్లు పుష్కరాలకు కేటాయించారు... ఆ డబ్బంతా ఎటుపోయింది...? విదేశీ టూర్లకు, సొంత ఇళ్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అర్ధం చేసుకున్నాం... మీ  జీవితాలు మాత్రం బాగుంటాయి... కానీ, మా జిందగీలు మారవా? అంటూ ప్రశ్నించారు జనసేనాని. 

ఉద్యమాల పురిటిగడ్డ నేర్పిన పాఠం మర్చిపోకండి అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు పవన్ కల్యాణ్... సహనం కోల్పోతే ప్రభుత్వాలను తరిమితరిమి కొడతారంటూ వార్నింగ్ ఇచ్చిన జనసేనాని... రాత్రికి రాత్రే మార్పులు వస్తాయని నేను భావించడం లేదు.... కనీసం చలనమైనా వస్తుందనేదే నా ప్రయత్నం అన్నారు. నా దీక్షకు అనుమతి ఇవ్వొద్దని సీఎంవో నుంచి ఆదేశాలు వచ్చాయని ఆరోపించిన పవన్... అనుమతులపై పోలీసులు, రెవెన్యూ శాఖలను నేను తప్పు పట్టడం లేదు... కానీ, నా దీక్షకు అనుమతులు ఇవ్వని ముఖ్యమంత్రిని తప్పు పడుతున్నా... నన్ను, నా సేనను అణచివేయాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

నా దీక్ష రాజకీయ గుర్తింపు కోసం కాదన్నారు పవన్... నాకు రాజకీయ గుర్తింపు కావాలంటే... మీకు మద్దతు ఎందుకు ఇచ్చానని ప్రశ్నించిన ఆయన... రాష్ట్రం విభజన తర్వాత ఆర్ధిక ఇబ్బందులు అని ఎందుకు ఆర్భాటాలకు పోయారు..? మనల్ని దగా చేసిన కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలికిన రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపైనే తన నిరసన అన్నారు. శ్రీకాకుళంలో భారత మాతా వెలిసింది... ప్రజల్లో చైతన్యం వస్తే తన్ని తన్ని కొడతారంటూ ఉద్రేకంగా మాట్లాడిన జనసేనాని... సినిమాల్లో రెండున్నర గంటల్లో సమస్యలు పరిష్కరించవచ్చు... సినిమాలు వదులుకొని రావటం నాకు సరదా కాదు.. ప్రజల కు సేవ చేయడం, సామాజిక రాజకీయ చైతన్యం కోసమే నని స్పష్టం చేశారు. సామాజంలో అభివృద్ధిని నమ్మటం, గుప్పిట్లో పెట్టుకోవటం రెండే కులాలని చెప్పుకొచ్చిన పవన్... న్నో మార్పులు టీడీపీ సర్కార్ తెస్తుందని అనుకున్నాం... కానీ, ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.