సహాయక చర్యల్లో పాల్గొనండి..

సహాయక చర్యల్లో పాల్గొనండి..

మంటూరు వద్ద గోదావరి నదిలో జరిగిన ఘోర లాంచీ ప్రమాదంపై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాదాపు 35మంది గల్లంతైన ఈ లాంచీ ప్రమాదం దేవీపట్నం మండలం సమీపంలో జరిగింది. 16 మంది మాత్రం సురక్షితంగా బయటపడగా.. గల్లంతైన వారిలో మహిళలు, చిన్నారులే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనపై ఈరోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రమాదంపై వార్తను వినగానే ఎంతో ఆవేదనకు లోనయ్యానని... భారీ సంఖ్యలో ప్రజలు గల్లంతవడం కలచివేసిందని అన్నారు. జనసేన కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని సూచించారు.