నేటి నుంచి జనసేన పోరాటయాత్ర...

నేటి నుంచి జనసేన పోరాటయాత్ర...

నేడు సమర శంఖాన్ని పూరించనున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్... వెనుకబడిన జిల్లాగా గుర్తింపు పొందిన శ్రీకాకుళంలో తన పోరాట యాత్ర ప్రారంభిస్తారు. ఇప్పటికే పవన్ యాత్ర కోసం భారీ ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర జనసేన ప్రతినిధులతో సమావేశమైన పవన్... రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. ప్రధాన సమస్యల చిట్టాను తయారు చేసుకున్నారు. ఇచ్ఛాపురం నుంచి పవన్ పోరాటయాత్ర మొదలు కానుండగా... కాసేపట్లో కవిటి మండలం కపాసకుర్ది తీరప్రాంతం వద్ద గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి, ఆ తర్వాత అక్కడే స్వేచ్ఛావతి ఆలయంలో కూడా పూజలు చేయనున్నారు పవన్‌ కల్యాణ్. ఆ తర్వాత జనసేన నిరసన కవాతు నిర్వహించనుంది. మధ్యాహ్నం సూరంగి రాజావారి మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు  పవన్ కల్యాణ్.