దీక్ష విరమించిన పవన్ కల్యాణ్...

దీక్ష విరమించిన పవన్ కల్యాణ్...

శ్రీకాకుళం జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ఒక్క రోజు దీక్షను విరమించారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై ప్రభుత్వం ముందు 17 డిమాండ్లు ఉంచిన జనసేనాని... ఏపీ సర్కార్ నుంచి సరైన స్పందనలేకపోవడంతో నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు దీక్షకు కూర్చున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఉద్దానం కిడ్నీ బాధిత కుటుంబం ఇచ్చిన నిమ్మరసాన్ని తాగి తన దీక్ష విరమించారు జనసేన అధినేత. దీక్షలో ఉన్న పవన్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ... వివిధ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు మద్దతు తెలపగా... జనసేనానికి సంఘీభావం తెలుపుతూ జనసేన శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.