నిరాహార దీక్షకు దిగిన జనసేనాని...

నిరాహార దీక్షకు దిగిన జనసేనాని...

మరోసారి ఉద్దానం తెరపైకి వచ్చింది... ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలు తీర్చకపోతే నిరాహారదీక్ష చేస్తానంటూ రెండు రోజుల క్రితం ప్రకటించిన విధంగానే... జనసేన అధినేత పవన్ కల్యాణ్... నిరాహారదీక్షకు దిగారు... శ్రీకాకుళం రిసార్ట్‌లో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఆయన ఒక్క రోజు నిరాహార దీక్ష ప్రారంభించారు. నిన్నటి నుంచే ఘన ఆహారం మానేసిన పవన్.... ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి రేపు సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష కొనసాగించనున్నారు. 

కిడ్నీ బాధితుల సమస్యపై సర్కార్ కు 48 గంటల గడువు పెట్టారు పవన్. కిడ్నీ బాధితుల సమస్యలపై 17 డిమాండ్లను ఏపీ ప్రభుత్వం ముందు పెట్టిన జనసేనాని... పవన్ పెట్టిన డెడ్‌లైన్ ఉదయం 11 గంటలతో ముగిసిపోగా... ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించిన పవన్... పోరాట దీక్ష చేపట్టారు. దశాబ్దాలు గడుస్తున్నా ఉద్దానంలోని పరిస్థితిలో మార్పులేదు. కిడ్నీ వ్యాధికి నియంత్రణ లేదు. సమస్య పరిష్కారానికి చొరవ లేదు. మంచినీటి సరఫరా లేదు. మనుషుల ప్రాణాలు పోతున్నా.. పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ మధ్య కాస్త హడావిడి చేశారు. తర్వాత మర్చిపోయారు... ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది ఉద్దానం.