పార్టీ నేతలతో పవన్ చర్చలు...

పార్టీ నేతలతో పవన్ చర్చలు...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో జనసేన ముఖ్య నాయకులు, కొర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వీరందరూ జనసేన ఎన్నికల  వ్యూహకర్త దేవ్ సమక్షంలో సమావేశం అయ్యారు. ఉత్తరాంధ్రలోని మొత్తం 34 నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్ర ఉండబోతుంది. ఈ బస్సు యాత్ర రూట్ మ్యాప్ ను సిద్ధంచేశారు జనసేన నాయకులు. ఇదే రూట్ మ్యాప్ ను పవన్ కళ్యాణ్ కు వివరిస్తున్నారు జనసేన ముఖ్య నాయకులు, కొర్ కమిటీ సభ్యులు. ఈ మ్యాప్ పై ఒక స్పష్టతకు వచ్చిన తర్వాత అధికారంగా వెల్లడించనున్నారు. ఇవాళ సాయంత్రం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. రేపటి నుండి యాత్రకు సన్నాహాలు చేస్తున్నారు పవన్. చిత్తూరు జిల్లా పర్యటన అనంతరం పవన్ విశాఖ చేరుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియోను క్లిక్ చేయండి.