అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోను...

అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోను...

ఎక్కడ అన్యాయం జరిగినా తాను చూస్తూ ఊరుకోనని స్పష్టం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్... ప్రజాసమస్యల అధ్యయనానికి 'జనసేన పోరాట యాత్ర' చేపట్టిన పవన్... నేడు ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఎలా ఉంటాయో తెలుసన్నారు... మా నాన్న కూడా ప్రభుత్వ ఉద్యోగే అని తెలిపిన పవన్ కల్యాణ్... మా నాన్న  ఎప్పుడూ మా మీద ఆధార పడొద్దని భావించేవారని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఉద్యోగుల డబ్బులతో ప్రభుత్వం వ్యాపారం చేయడం ఏంటి? అని ఘాటుగా ప్రశ్నించారు పవన్... సీపీఎస్ విధానం గురించి పూర్తి వివరాలు తెలుసుకుని ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతానని స్పష్టం చేసిన జనసేనాని... తాను యాత్ర ఆషామాషీ కోసం చేయడం లేదు... ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసమే యాత్ర చేస్తున్నానని వెల్లడించారు. అన్ని వర్గాలవారి సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు పవన్.