జులై నుండి పవన్- క్రిష్ సినిమా...?

జులై నుండి పవన్- క్రిష్ సినిమా...?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే పవన్ ఈ సినిమా తరువాత క్రిష్ దర్శకత్వం లో మరో సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఇందులో ఇందులో పవన్ మొగలాయిల కథ చేస్తున్నాడని సమాచారం. అలాగే సినిమా అంతా కోహినూర్ వజ్రం చుట్టూ కథ నడుస్తుందని తెలుస్తుంది. అందువల్ల సినిమా కోసం హైదరాబాద్ లోనే భారీ సెట్స్ వేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారంట... కానీ వారు ఎవరు అనే విషయం మాత్రం ఇంకా తెలియదు. అయితే అందులో ఓ హీరయిన్ గా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లేదా కీర్తిసురేష్ నటించే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. కానీ ప్రస్తుతం అని ప్రభుత్వాలు లాక్ డౌన్ లో సడలింపులు ఇస్తునందున ఈ సినిమా జులై లో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. అయితే చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.