శెట్టిపల్లిలో జనసేనాని పవన్ కల్యాణ్ 

శెట్టిపల్లిలో జనసేనాని పవన్ కల్యాణ్ 

చిత్తూరు జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఐదో రోజు పర్యటిస్తున్నారు. నిన్న చిత్తూరు రోడ్డు విస్తరణ బాధితులను  పరామర్శించిన ఆయన ఈరోజు శెట్టిపల్లికి చేరుకున్నారు. పవన్  రైతులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. భూములు కోల్పోయిన నిర్వాసితులను ఆయన కలిచి మాట్లాడుతున్నారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లా అభిమాన సంఘాలు, జనసేన కార్యకర్తలతో ఆయన సమావేశమవుతారు. ఈ సందర్భంగా జనసేన భవిష్యత్ కార్యాచరణ గురించి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి తోడు తాను చేపట్టనున్న రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర గురించిన షెడ్యూల్ ను కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.