లోకేశ్ .. రోడ్లు మీ తాతల సొత్తా..?

లోకేశ్ .. రోడ్లు మీ తాతల సొత్తా..?

శ్రీకాకుళంలో జరుగుతున్న జన పోరాట యాత్రలో మంత్రి నారా లోకేశ్‌పై విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. లోకేశ్.. రోడ్లు మీ తాతల సొత్తు కాదు కదా.. మీ ఇంట్లో డబ్బులతో రోడ్లు వేశారా..? అని ప్రశ్నించారు.. జనం కట్టే ట్యాక్స్‌లు ఏం చేస్తున్నారు.. జన్మభూమి కమిటీల పేరుతో మోసం చేస్తున్నారని.. టీడీపీ జెండా మోసిన వారికే ఇల్లు, పథకాలా అని పవన్ ఆరోపించారు. అమరావతిలో ఎవరైనా ఇల్లు కట్టగలరా.. ఉద్యోగం పొందగలరా అన్ని ప్రశ్నించారు.

హైదరాబాద్‌లో చేసిన తప్పే.. అమరావతిలో చేస్తున్నారని.. నిధులు, నియామకాల్లో నిర్లక్ష్యం చేస్తే.. రాష్ట్రం మళ్లీ ముక్కలు కావాల్సి వస్తుందని.. అభివృద్ధి సమానంగా జరపకపోతే.. మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తప్పదని పవన్ హెచ్చరించారు. దీనిపై త్వరలోనే మేధావులతో అమరావతిలో మీటింగ్ పెడతానని జనసేనాని అన్నారు. రాష్ట్రంలో భూకబ్జాలు, ఇసుక మాఫియా పెరిగిపోయిందని.. విగ్రహాలకు ఉన్న రక్షణ.. ప్రజలకు లేదని.. టీడీపీ నేతలు సాయం చేసిన వారి చెయ్యి నరుకుతారని పవన్ ఆరోపించారు. చంద్రబాబు రిటైర్ కావాల్సిన సమయం వచ్చిందని.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. తెలుగుదేశం అవినీతిని బయటకు తీస్తానని.. వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ ఇస్తానని.. ఉత్తరాంధ్రలో కొబ్బరి బోర్డ్ ఏర్పాటు చేస్తానని.. జీడీ పరిశ్రమను ఆదుకుంటానని పవన్ కల్యాణ్ చెప్పారు.